ఇద్దరిపై వేటు వేసిన కేసీఆర్
ఇద్దరు బీఆర్ఎస్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్ణయం తీసుకుంది;
ఇద్దరు బీఆర్ఎస్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా ఇద్దరూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
పార్టీకి వ్యతిరేకంగా...
ఆత్మీయ సదస్సుల పేరుతో పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా వీరు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటిస్తూ క్యాడర్ లోనూ అయోమయం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ వేచి చూసిన అధినాయకత్వం నిన్న ఇద్దరు ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడంతో వేటు వేసింది.