రాజకీయాల్లో రైతు నేతలు రావాలి.. కేసీఆర్ పిలుపు

తెలంగాణ సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశంలో రైతాంగ సమస్యలను పరిష్కారానిక అనుసరించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2022-08-28 13:30 GMT

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశంలో రైతాంగ సమస్యలను పరిష్కారానిక అనుసరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పుడే మనం అనుకున్న గమ్యానికి చేరగలమని చెప్పారు. ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటం చేయడం ద్వారానే దేశ వ్యవసాయ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. రైతు వ్యతిరేకులతో నేడు జై కిసాన్ అనే నినాదాన్ని పలికించాలని ఆయన అన్నారు. రెండో రోజు రైతు సంఘాల నేతలతో సమావేశమైన కేసీఆర్ వారితో పలు అంశాలను చర్చించారు.

ఆత్మగౌరవం కాపాడుకునేలా....
రైతు ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా ఉద్యమాలు కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టసభల్లోకి రైతులు ఎందుకు రాకూడదని ఆయన ప్రశ్నించారు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు. వజ్రోత్సవాలు జరుగుతున్న సమయంలోనూ రైతు సమస్యలు నేటికీ పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను వ్యతిరేకించాలన్నారు. జాతీయ స్థాయిలో రైతుల ఐక్యవేదికను ఏర్పాటు చేయాలని ఈ రెండు రోజుల సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే మరోసారి సమావేశమై విధివిధానాలను రూపొందించుకోవాలని భావిస్తున్నారు.


Tags:    

Similar News