తెలంగాణలో కొనసాగుతున్న చలితీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత తగ్గలేదు. 10 గంటల వరకూ చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.
తెలంగాణలో చలి తీవ్రత తగ్గలేదు. ఉదయం పది గంటల వరకూ చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి మాసం రెండో వారంలో కూడా చలితీవ్రత తగ్గలేదు. వాతావరణంలో మార్పుల కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది.
కనిష్ట స్థాయికి....
ప్రధానంగా తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వాంకిలో 9.3 డిగ్రీలు, సోనాలలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొద్ది రోజులు చలితీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.