కరోనాపై హైకోర్టు.. ఆ జాతర సంగతేంటి?
తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది;
తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మక్క, సారలమ్మ జాతరపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని మైకోర్టు ఆదేశించింది. వారాంతపు సంతల్లోనూ కోవిడ్ నిబంధనలు ఏ మేరకు అమలుపరుస్తున్నారో తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో విద్యాసంస్థల ప్రారంభంపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో పాఠశాలలను ఎప్పటి నుంచి తెరవాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది.
పాఠశాలలకు....
ఈ నెల 30వ తేదీ వరకూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పాఠశాలల ప్రారంభంపై సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటు తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతం మాత్రమే ఉందని వైద్యశాఖ అధికారి శ్రీనివాసరావు చెప్పారు. 77 లక్షల ఇళ్లలో ఇప్పటి వరకూ ఫీవర్ సర్వే నిర్వహించామని, 3.45 లక్షల కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.