టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఈడీ నోటీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.;
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు డీసీసీబీ ఛర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. రేపు, ఎల్లుండి ఈడీ ఎదుటకు విచారణ నిమిత్తం హాజరు కావాలని పేర్కొంది. వీరితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్ర, తలసాని మహేష్ లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు వారిద్దరినీ విచారించింది.
మంత్రి సోదరులకు...
క్యాసినో వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మిగిలిన వారిని కూడా విచారించేందుకు సిద్ధమయింది. మనీ ల్యాండరింగ్, హవాలా వంటి వ్యవహారాలపై వీరిని విచారించే అవకాశముందని తెలుస్తోంది.