Breaking : కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు?
ీబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు హాజరు కావాలని కోరారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు హాజరు కావాలని కోరారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని కవితను ఈ మెయిల్ ద్వారా కోరారు. కానీ ఈరోజు మరోసారి హాజరవ్వాలని హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే కల్వకుంట్ల కవిత తాను ఈరోజు హాజరు కాలేనని, విచారణకు సోమా భరత్ తన తన తరుపున హాజరవుతారని ఈడీ కార్యాలయానికి తెలిపారు.
కవిత తరుపున...
కొద్ది సేపటి క్రితం కల్వకుంట్ల కవిత న్యాయవాది సోమా భరత్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 11,20, 21 తేదీల్లో కవితను ఈడీ అధికారులు విచారణ జరిపారు. సుమారు ముప్ఫయి గంటల పాటు విచారణ జరిపారు. నిన్న కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరోసారి కల్వకుంట్ల కవితకు ఈడీ కార్యాలయం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.