మాజీ కలెక్టర్ కు బిగ్ రిలీఫ్

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.;

Update: 2021-11-23 09:16 GMT

సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. వెంకట్రామిరెడ్డి కలెక్టర్ గా ఉండి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంపై హైకోర్టులో పిటీషన్ లు దాఖలయ్యాయి. అలాగే రైతులను ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరో పిటీషన్ దాఖలయింది.

హైకోర్టు కొట్టివేయడంతో....
ఈ రెండు పిటీషన్లను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయినందున ఈ పిటీషన్ విచారించేందుకు అర్హత లేదని హైకోర్టు అభిప్రాయపడింది. మరొకవైపు పిటీషనర్ కూడా తన పిటీషన్ ను వెనక్కు తీసుకున్నట్లు తెలిపడంతో వెంకట్రామిరెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఎమ్మెల్యే కోటాలో వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూడా.


Tags:    

Similar News