Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ కు హరీశ్ కౌంటర్
మూసీ నది ప్రాజెక్టు సుందరీకరణ అంటే ముందు దానిని శుభ్రపర్చాలని, కూల్చివేతలు కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు
మూసీ నది ప్రాజెక్టు సుందరీకరణ అంటే ముందు దానిని శుభ్రపర్చాలని, కూల్చివేతలు కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. నదీ జలాల శుభ్రంతో మూసీ నది పునరుజ్జీవం మొదలవ్వాలని ఆయన అన్నారు. అంతే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదరించడం కోసం కాదని హరీశ్ రావు అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే మూసీ ప్రాజెక్టును బయటకు తెచ్చారన్నారు. మూసీని శుభ్రపర్చాలంటే ముందు అందులో వ్యర్థాలను కలవకుండా చూడాలని హరీశ్‌రావు అన్నారు.
అన్ని అబద్ధాలే...
నిన్నటి సీఎం మాటలతో అబద్ధమే తేలిపోయిందని హరీశ్‌రావు అన్నారు. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడుతున్నామని చెబుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 250 చదరపు గజాలతో ఇళ్లు కట్టించి ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకూ ఆర్ & ఆర్ ప్యాకేజీలో ఏ ప్రభుత్వమూ ఇంత స్థలాన్ని కేటాయించలేదన్నారు. 2013 భూసేకరణ చట్టానికి మించి అమలు చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమని హరీశ్ రావు అన్నారు.