మాజీ మంత్రి హరీశ్ రావు చాయ్, బిస్కెట్
మాజీ మంత్రి హరీశ్ రావు తన మిత్రులతో నీలోఫర్ కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ కన్పించారు;
దాదాపు తొమ్మిదేళ్ల పాటు అలుపెరగకుండా, విశ్రాంతి లేని జీవితాన్ని గడిపిన బీఆర్ఎస్ నేతలు మొన్నటి ఓటమితో కొంత స్వాంతన కావాలని కోరుకుంటున్నట్లుంది. మంత్రిగా ఎప్పుడూ బిజీగా ఉండే హరీశ్ రావు అటు సిద్ధిపేట టు హైదరాబాద్ మధ్య నిత్యం ప్రయాణం చేస్తూనే ఉండేవారు. ఆయనకు సమయం సరిపోయేది కాదు.
కాస్తంత వెసులుబాటుతో...
కానీ ఇప్పుడు పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో పాటు పెద్దగా పనులు లేకపోవడంతో రాజకీయంగా ఆయనకు కొంత విశ్రాంతి చిక్కినట్లయింది. అందుకే ఆయన నీలోఫర్ కేఫ్ లో కనిపించారు. ఇరాన్ చాయ్, బిస్కెట్ లను తింటూ కాసేపు సేదతీరారు. ఆయనతో పాటు మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా నీలోఫర్ కేఫ్ కు వచ్చారు. అక్కడ కూర్చుని కాసేపు మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.