ఉత్తమ్ ముసుగు వీరుడు
పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు ఈ సీనియర్ నేతలు ఏమయ్యారని మాజీ ఎమ్మెల్యే అనిల్ ప్రశ్నించారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు ఈ సీనియర్ నేతలు ఏమయ్యారని ప్రశ్నించారు. ఉత్తమ్ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కోవర్టుగా పనిచేసిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడం నిజం కాదా? అని అనిల్ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఈ సీనియర్ నేతలు ఏమయిపోయారన్నారు.
వీరంతా ఎక్కడకి వెళ్లారు?
కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా సీనియర్ నేతలు వ్యవహరించడం సరికాదని అనిల్ కుమార్ అన్నారు. బహిరంగంగా మాట్లాడి క్యాడర్ కు తప్పుడు సంకేతాలను పంపించిందని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్షన్ లోనే సీనియర్లు నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుకు రాని సేవ్ కాంగ్రెస్ ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చిందన్నారు. లోపాయికారిగా రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలిపారన్నారు. సునీల్ కొనుగోలు ఆఫీస్ పై దాడి చేసినప్పుడు ఈ సీనియర్లు ఏమయిపోయారని అనిల్ ప్రశ్నించారు.