Schools Holiday : రేపు ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది;

Update: 2023-11-28 08:59 GMT
holiday, schools, heavy rains, tirupati
  • whatsapp icon

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. రేపటి నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు రేపు సాయంత్రం నుంచే బయలుదేరి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల కోసం....
పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపుతో పాటు వారికి సామాగ్రి అందచేయనుండటంతో బుధ, గురు వారాల్లో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తిరిగి పాఠశాలలు హైదరాబాద్ లో డిసెంబరు 1వ తేదీన తెరుచుకుంటాయని తెలిపింది. పాఠశాలల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా ఒక కారణం.


Tags:    

Similar News