Kalvakuntla Kavitha : నేడు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది;

Update: 2024-04-04 03:09 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ విచారణ జరగనుంది. కవిత పిటీషన్ ను న్యాయమూర్తి కావేరి బావేజా విచారించనున్నారు. కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తొలుత పది రోజల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది.

తీహార్ జైలులో...
ప్రస్తుతం తీహార్ జైలులో కవిత ఉన్నారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తుంది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. మరో వైపు తన కుమారుడికి పరీక్షలున్నందున ఏప్రిల్ 14 వరకూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఈడీ వివరణ కోరింది. ఈరోజు దీనిపై విచారన జరగనుండటంతో కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అన్న ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News