రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేయాల్సిందే.. హైకోర్టు ఆదేశం

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు ఆదేశించింది.;

Update: 2022-01-17 07:30 GMT

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్న తెలిపింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది.

ఈ నెల 25వ తేదీకి....
కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం సమావేశమై చర్చిస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు వెల్లడించారు. పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.


Tags:    

Similar News