రేపు స్పీకర్ ను కలవండి.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన
బీజేపీ సభ్యుల సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పు చెప్పింది. సభలో నిర్ణయాధికారం స్పీకర్ దేనని పేర్కొంది.;
బీజేపీ సభ్యుల సస్పెన్షన్ పై హైకోర్టు తీర్పు చెప్పింది. సభలో నిర్ణయాధికారం స్పీకర్ దేనని పేర్కొంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు ఒక సూచన చేసింది. సభకు గౌరవ అధ్యక్షుడు స్పీకరే కనుక, ఆయన ఎదుట రేపు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని కోరారు. స్పీకర్ కు విన్నవించుకోవాలని కోరారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే లోపు స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యేలు తమపై విధించిన సస్పెన్షన్ విషయంలో పునరాలోచించాలని అభ్యర్థించుకోవాలని హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించింది.
పరిష్కరించే దిశగా.....
సభాపతిగా స్పీకర్ కూడా సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కోరింది. మనది ప్రజాస్వామ్య దేశమని, సభలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లుతుందని హైకోర్టు కోరింది. బీజేపీ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.