తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో ఊరట

తెలంగాణలో భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ చెప్పింది;

Update: 2022-02-17 12:44 GMT

తెలంగాణలో భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై దాఖలయిన పిటీషన్లపై విచారించిన హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ప్రభుత్వం తమ భూములను విక్రయించడానికి అభ్యంతరం చెప్పలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ నేత విజయశాంతి ఈ పిటీషన్ ను దాఖలు చేశారు.

భూముల విక్రయానికి...
భూముల విక్రయంలో ప్రభుత్వ టెండర్లు, ఈ వేలం వంటి పారదర్శక విధానాలను అవలంబించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం భూములను విక్రయిస్తూ ప్రజల ఆస్తులను కరిగించేస్తుందని పిటీషనర్ పేర్కొన్నారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది.


Tags:    

Similar News