ఎంసెట్ పరీక్ష వాయిదా

తెలంగాణలో ఎంసెట్ పరీక్ష షెడ్యూల్‌‌లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

Update: 2023-03-31 12:59 GMT

తెలంగాణలో ఎంసెట్ పరీక్ష షెడ్యూల్‌‌లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. నిజానికి మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే దీనిని మే 12,13, 14 తేదీలకు మార్చారు. మే 7వ తేదన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండటం, 8,9 తేదీలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఉండటంతో ఎంసెట్ పరీక్షను వాయిదా వేశారు.

ఏప్రిల్ 4వ తేదీతో....
ఎంసెట్ దరఖాస్తుల గడువు వచ్చే నెల 4వ తేదీతో ముగియనుంది. మే 2వ తేదీ వరకూ ఆలస్యంగా రుసుము చెల్లించి దరఖాస్తు చేయవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకూ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌కు 1,14,989 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.


Tags:    

Similar News