Jagan Video in Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీలో జగన్ ప్రసంగం
తెలంగాణ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన వీడియో హైలెట్ గా నిలిచింది.;
Jagan Video in Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన వీడియో హైలెట్ గా నిలిచింది. కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేశారంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్, జగన్ లు అనేక సార్లు ప్రగతి భవన్ లో కలుసుకున్నారని, బిర్యానీ తిని కృష్ణా నీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు.
ఇద్దరూ కుమ్మక్కయి...
ఎంత నీటిని తరలించారో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సరిహద్దులు దాటి కృష్ణా నీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు. జగన్, కేసీఆర్‌లు ఏకాంత చర్చలు జరిపి నీటిని ఏపీకి తరలించుకుపోయారన్నారు. ఈ సందర్భంగా జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియోను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శించారు.