డీల్ చేసింది ఇలా.. ఆపరేషన్ అలా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల పాటు ఈ డీల్ పై పోలీసులు నిఘా పెట్టారని తెలిసింది. మొయినాబాద్ ఫాంహౌస్ లో పోలీసుల నిఘా వేశారు. వివిధ వేషాలలో మాటు వేసి అక్కడ జరిగే ప్రతి దృశ్యాన్ని రికార్డు చేశఆరు. 70 మంది పోలీసులతో మూడు రోజుల పాటు ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. 84 సీసీ కెమెరాలతో ఫాంహౌస్ వద్ద అన్ని కోణాల్లో దృశ్యాలను రికార్డు చేసినట్లు సమాచారం.
వేరే ఫోన్ నుంచి...
ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న నందు తన ఫోన్ నుంచి కాకుండా వేరే ఫోన్ నుంచి సంప్రదింపులు జరిపినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నుంచి సంప్రదింపులు జరిపారంటున్నారు. అయితే ఢిల్లీలో ఉన్న పెద్దలతో మాట్లాడించే ప్రయత్నం జరిగినా అది జరగలేదు. వారెవరూ అందుబాటులో లేరన్న సమచారం వచ్చినట్లు చెబుతున్నారు. ఫాంహౌస్ లో మొత్తం గంటా 20 నిమిషాలు వీడియో రికార్డు అయినట్లు తెలిసింది.
మూడు రోజుల నుంచి...
ఈ వీడియో, ఆడియో రికార్డు అయినట్లుగా భావిస్తున్నట్లు చెబుతున్న పోలీసులు బాడీ వోర్న్ కెమెరాలను ఉపయోగించారని చెబుతున్నారు. ఎమ్మెల్యేల శరీరంలోనే కెమెరాలను అమర్చి రికార్డు చేసినట్లు సమాచారం. ఇప్పటికే మొయినాబాద్ ఫాంహౌస్ కు శంషాబాద్ డీసీపీ చేరుకున్నారు. అక్కడ పనివాళ్ల స్టేట్‌మెంట్ ను తీసుకున్నారు. ఫాంహౌస్ ను మరోసారి సోదాలు జరిపినట్లు తెలిసింది. ఈరోజు పోలీసు ఉన్నతాధికారులు దీనిపై మీడియా సమావేశం పెట్టే అవకాశముంది. మరోవైపు నలుగురు ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశం పెట్టనున్నారని తెలిసింది. దీనికి సంబంధించి నేరపూరిత కుట్ర 120 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది.