ఇంకా ఉందట.. మళ్లీ ఎప్పుడంటే?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట మూడో సారి విచారణ పూర్తయింది;

Update: 2023-03-21 16:11 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట మూడో సారి విచారణ పూర్తయింది. పది గంటల పాటు అధికారులు విచారణ చేశారు. ఉదయం 11.30 గంటలకు విచారణకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 9.40 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. ఈడీ ఆఫీస్ దగ్గరకు ఎస్కార్ట్‌ వాహనం చేరుకోవడంతో ఆమెను ఈరోజు కూడా విచారించి వదిలేస్తారని భావించారు. తిరిగి విచారణకు రమ్మని ఆదేశించారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే వచ్చే వారం కవితను విచారణకు పిలిచే అవకాశముంది. కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషణ చేసిన తర్వాత తిరిగి మరోసారి విచారణకు రమ్మని పిలిచే అవకాశముందని చెబుతున్నారు.

ఫోన్లపైనే....
మరోవైపు ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఫోన్లపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఈడీ అధికారుల కోరిన డాక్యుమెంట్లను కూడా కవిత న్యాయవాది సోమా భరత్ తీసుకు వచ్చి అందచేశారు. అయితే కవితను ఈ విషయాలను కాకుండా మరే విషయాలపై ప్రశ్నించారన్న విషయం కాసేపట్లో తెలియనుంది. కవిత ఇప్పటికే మూడు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 24వ తేదీన ఆమె పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే విచారణలో కవితకు సానుకూలంగా తీర్పు వస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. వచ్చే వారం మరోసారి కవితకు ఈడీ కార్యాలయం నుంచి పిలుపు అందే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News