బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆ హీరోను గుర్తుపట్టారా..?
ఈ సమయంలో ఓ హీరో కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కనిపించారు.;
దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీని అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని... మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని.. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు. తాను దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు... టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేస్తే ఎలాగని చాలా మంది తనను ప్రశ్నించారని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ తొలి కార్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్ర అని తెలిపారు.