KTR : ఓల్డ్ సిటీ బిర్యానీ కోసం కేటీఆర్.. అర్థరాత్రి

రాత్రి హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకి వెళ్లిన కేటీఆర్ అక్కడ హోటల్ లో బిర్యానీ, చాయ్ తాగి అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చారు.;

Update: 2023-11-18 05:50 GMT

మంత్రి కేటీఆర్ ఎన్నికల వేళ ప్రచారమే కాదు.. సోషల్ మీడియాలోనూ ముందుండటానికి ప్రయత్నిస్తుంటారు. విన్నూత్న తరహాలో ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాటు కోడి కూర వండి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అయితే తాజాగా నిరన రాత్రి హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకి వెళ్లిన కేటీఆర్ అక్కడ హోటల్ లో బిర్యానీ, చాయ్ తాగి అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చారు.

సెల్ఫీ కోసం...
ఓల్డ్ సిటీలో హైదరాబాద్ బిర్యానీ అంటే ఫేమస్. అందులో పాతబస్తీలో ఉన్న షాదాబ్ రెస్టారెంట్ ఇంకా ఫేమస్. అక్కడ రాత్రివేళల్లోనూ బిర్యానీ, టీ, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడకు వెళ్లిన కేటీఆర్ బిర్యానీ తిన్నారు. చాయ్ తాగారు. అక్కడ ఉన్న కస్టమర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాతబస్తీ యువకులు కేటీఆర్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు.


Tags:    

Similar News