నేడు నేతలతో కేటీఆర్ కీలక భేటీ
నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.;

నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచాణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ సమావేశం నిర్వహించనున్నారు.
సిల్వర్ జూబ్లీ వేడుకలు...
ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేటీఆర్ ప్రధానంగా నేతలతో చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు త్వరలో జరనున్న పార్టీ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు, పార్టీ ఏర్పాటయి ఐదేళ్లు అవుతున్న సందర్భంగా జరుగుతున్న సిల్వర్ జూబ్లీ వేడుకలపై కూడా నేతలతో చర్చించనున్నారు.