తెలంగాణవాసులకు చల్లని కబురు

తెలంగాణలో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది;

Update: 2023-03-12 03:18 GMT

తెలంగాణలో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు మండి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. భానుడి భగభగల నుంచి రెండు రోజుల పాటు ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. ఛత్తీస్‌గడ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఏర్పడిన ద్రోణి కారణంగా రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నెల 20 వరకూ...
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి గత రెండు, మూడు రోజులుగా దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఎండ తీవ్రత కొద్దిగా తగ్గిందని చెప్పారు. ఈ ప్రభావంతో మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. మార్చి 20వ తేదీ వరకూ కొంత చల్లని వాతావరణం ఉండనుందని తెలిపింది. హైదరాబాద్ లో సాధారణ ఉష్ణోగ్రతకన్నా 2.6 డిగ్రీలు తక్కువగా నమోదయినట్లు వాతావరణ శాఖ తెలపింది. ఈ నెల 16 తేదీ తర్వాత చిరు జల్లులు పడే అవకాశముందని పేర్కొంది.


Tags:    

Similar News