Rain Alert : తెలంగాణలో వాతావరణ మార్పు... వర్షాలు కూడా
తెలంగాణలో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది;
తెలంగాణలో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ద్రోణి ఫలితంగా ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉదయం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉష్ణోగ్రతలు కూడా...
తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రి పూట తక్కువగా ఉంటున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తాయని, ఉదయం వేళల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ రెండురోజులు వర్షాలు కురిసే అవకాశమున్నందున ఉదయం పూట ఉష్ణోగ్రతలు మరింత తక్కువయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. బుధ, గురు వారాల్లో వర్షం కురిసే అవకాశముంటుందని వాతావరణ శాఖ తెలిపింది.