Telangana : తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. నాలుగు రోజుల పాటు
తెలంగాణలో నాలుగు రోజలు పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది
తెలంగాణలో నాలుగు రోజలు పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండలు మళ్లీ ముదిరాయని హెచ్చరించింది. నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశముందని తెలిపింది. వడగాల్పులు వీస్తాయని తెలిపింది. దీంతో అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించిది.
వర్షాలు కూడా...
అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, బయటకు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ తెలిపింది. మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకుని డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలని సూచించింది. 19వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది.