Rain alert : భారీ వర్షాలు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవావరణ శాఖ తెలిపింది;
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపింది.
ఈ జిల్లాల ప్రజలు...
కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.