ఒకే వేదికపై రేవంత్, కోమటిరెడ్డి
ఒకే వేదికపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్పించారు;
ఒకే వేదికపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్పించారు. ఇద్దరు నేతలు ఒకే వేదికపై కన్పించడం విశేషం. ఇందిరాపార్కు వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ రెండు రోజుల పాటు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఇద్దరూ వేదికపై పక్క పక్కనే కూర్చున్నారు.
రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక.....
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ లోకి అడుగుపెట్టలేదు. ఆయనపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల దారుణ ఓటమిపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఒకే వేదికపై కన్పించారు. ఇద్దరూ మాట్లాడుకోవడం కన్పించింది.