ఎన్నికలను అసహ్యంగా మార్చారు
ఎన్నికలను బీజేపీ, టీఆర్ఎస్ లు అసహ్యంగా మార్చాయాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
ఎన్నికలను బీజేపీ, టీఆర్ఎస్ లు అసహ్యంగా మార్చాయాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఈర్ఎస్ కు మిత్రబేధమే కాని శత్రుబేధం లేదని ఆయన అన్నారు. ఓటుకు ముప్ఫయి నుంచి నలభై వేల రూపాయలు మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. దిగజారి పార్టీలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఈ రెండు పార్టీలు అర్థాలు మార్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
మునుగోడు ప్రచారం...
తన పిటీషన్ పై చర్యలు పూర్తయ్యేంతవరకూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారదని ఆయన తెలిపారు. ఈరోజు నుంచి మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని తాము ప్రారంభిస్తున్నామని తెలిపారు. 14వ తేదీ నామినేషన్ వేసేంత వరకూ మునుగోడులోనే అందరు నేతలు ఉండి ప్రచారంలో పాల్గొనాలని ఆయన కోరారు. మునుగోడు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోకుండా, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.