వణికిపోతున్న జనం.. పెరిగిన చలిగాలులు
తెలుగు రాష్ట్రాల ప్రజలు చలిగాలులతో వణికి పోతున్నారు. ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలిగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు చలిగాలులతో వణికి పోతున్నారు. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలిగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ బయటకు రావడానికే భయపడి పోతున్నారు. సూర్యుడు వచ్చినా చలిగాలులు మాత్రం తగ్గడం లేదు. చలిగాలులతో జలుబు, దగ్గు, ఆయాసం వంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు...
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని కొమురం భీ జిల్లా ఆసిఫాబాద్ లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సిర్పూర్ లో 8.6 డిగ్రీు, ఆదిలాబాద్ జిల్లా బేలలాలో 9.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాలలో 10.7, నిర్మల్ జిల్లాలోని పెంబిలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.