బ్లాక్ ఫంగస్ బాధితుడికి అరుదైన శస్త్రచికిత్స

బ్లాక్ ఫంగస్ బారిన పడి ఏకంగా తన దంతాలను కోల్పోయిన వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మహారాష్ట్రలోని..

Update: 2022-05-17 04:03 GMT

బోధన్ : బ్లాక్ ఫంగస్.. కరోనా సెకండ్ వేవ్ లో తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించిన మరో వైరస్. ఈ బ్లాక్ ఫంగస్ బారినపడి చాలామంది ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ, మహారాష్ట్రలలో ఎక్కువగా కేసులు రావడంతో అందరూ ఆందోళన చెందారు. గాంధీ వైద్యులు ఈ రోగులకు మెరుగైన చికిత్స అందించి, బ్లాక్ ఫంగస్ ను తగ్గించడంలో విజయం సాధించారు. కానీ.. బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకున్నవారిలో పలు ఆరోగ్యసమస్యలు కనిపిస్తున్నాయి.

బ్లాక్ ఫంగస్ బారిన పడి ఏకంగా తన దంతాలను కోల్పోయిన వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన అమిత్ బిరాదర్ (42)కు సెకండ్ వేవ్ లో కరోనా సోకి 22 రోజులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకున్నాప్పటికీ.. బ్లాక్ ఫంగస్ సోకింది. బ్లాక్ ఫంగస్ సైనస్ ఎముక వరకూ విస్తరించడంతో అతని దంతాల వరుసలో మూడు పళ్లు మినహా పైదవడ ఎముక మొత్తం ఊడిపోయింది.
తీవ్రమైన నొప్పి, వాపు, రక్తస్రావంతో బాధపడుతున్న అమిత్.. చికిత్స కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగాడు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రం బోధన్ కు చెందిన వైద్యుడు శ్రీకాంత్ దేశాయ్ ను సంప్రదించారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న శ్రీకాంత్.. అమిత్ దేశాయ్ ఆరోగ్య పరిస్థితిని చూశాడు. తలకు 3డీ స్కానింగ్ చేసి ఎలా ఉందో చూశారు. తర్వాత చెవి కింద ఉన్న ఎముక శ్రజైగోమాటిక్), (టెరిగాయిడ్) సహాయంతో సహజత్వం ఉట్టిపడేలా శస్త్ర చికిత్స చేసి..కృత్రిమ పళ్లను అమర్చారు. తనకు ఎక్కడా చికిత్స అందదు అనుకున్న అమిత్ కు శ్రీకాంత్ కృత్రిమ దంతాలను అమర్చడంతో.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News