Telangana : నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
సంక్రాంతి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి;

సంక్రాంతి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవులను ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు తిరిగి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండగ మూడు రోజులు కావడంతో దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ విద్యాశాఖ సెలవులను ప్రకటించింది.
పరీక్షలు త్వరలో...
నేటినుంచి తిరిగి విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తిరిగి విద్యాసంస్థలు నేటి నుంచి తెలంగాణలో ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సెలవులు ముగించుకుని వచ్చిన వారు నేడు విద్యాసంస్థలకు హాజరు కానున్నారు. పరీక్ష తేదీలు దగ్గరపడుతుండటంతో తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.