Singareni Elections : నేడు సింగరేణి కార్మికసంఘం గుర్తింపు ఎన్నికలు
సింగరేణి ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది
సింగరేణి ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కోల్ట్ బెల్ట్ ఏరియాలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం పదమూడు కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపిస్తున్నాయి. ఇందుకోసం పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
నలభై వేల మంది ఓటర్లు...
ఈ ఎన్నికల్లో దాదాపు నలభై వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ ఆరు సార్లు సింగరేణి గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏఐటీయూసీ మూడుసార్లు, ఐఎన్‌టీయూసీ ఒకసారి, బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం రెండుసార్లు విజయం సాధించాయి. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరిది విజయమన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.