Telangana : వాతావరణం చల్లబడింది... వర్షాలు కురుస్తున్నా...ఉక్కపోత మాత్రం?
నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. వర్షాలు కురుస్తున్నాయి. అయినా తెలంగాణలో ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు
నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. వర్షాలు కురుస్తున్నాయి. అయినా తెలంగాణలో ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. మొన్నటి వరకూ ఎండ వేడిమికి అల్లాడిపోయిన ప్రజలు వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఈసారి ఎండల తీవ్రత నుంచి బయటపడతామా? లేదా? అన్న ఆందోళనలో ఉన్న ప్రజలకు నైరుతి రుతుపవనాలు త్వరగానే రావడంతో ఇబ్బంది తప్పింది. ప్రధానంగా తాగు నీటి సమస్య నుంచి బయటపడటంతో అధికార యంత్రాంగం కూడా ఊపిరిపీల్చుకుంది.
విద్యుత్తు వినియోగం...
అయితే వాతావరణం మారినప్పటికీ ఉక్కపోత మాత్రం కొనసాగుతూనే ఉంది. వర్షాలు కురుస్తున్నా చెమటలు మాత్రం వీడటం లేదు. దీంతో విద్యుత్తు వాడకం మాత్రం ఎక్కువగానే ఉందని తెలంగాణ విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడినా ఏసీల వాడకం ఇంకా జరుగుతుండటంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఇది విచిత్రమైన వాతావరణంగా పేర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ ఈపరిస్థితి చూడలేదని కొందరు సీనియర్ సిటిజన్లు చెబుతున్నారు.