మహిళ కమిషన్ సానుకూల స్పందన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభ్యర్థనకు రాష్ట్ర మహిళ కమిషన్ సానుకూలంగా స్పందించింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభ్యర్థనకు రాష్ట్ర మహిళ కమిషన్ సానుకూలంగా స్పందించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దూషించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని కోరింది.
హాజరు కాకుంటే చర్యలు...
అయితే తనకు పార్లమెంటు సమావేశాలున్నందున ఈ నెల18వ తేదీన మహిళ కమిషన్ ఎదుట హాజరవుతానని బండి సంజయ్ మహిళ కమిషన్ కు లేఖ రాశారు. మార్చి 18న కమిషన్ ముందు హాజరయ్యేందుకు మహిళ కమిషన్ అంగీకరించింది. ఆరోజు ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయంలో హాజరుకావాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది