Breaking: కవిత పిటీషన్ విచారణ వాయిదా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత విచారణకు వాయిదా వేసింది;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత విచారణకు వాయిదా వేసింది. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కవితలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలిపించడం, తనను రాత్రి వరకూ విచారణ చేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కవిత పిటీషన్ లో పేర్కొన్నారు. సూర్యాస్తమయం వరకూ విచారించాలని పేర్కొన్నారు.
ఇరువురి వాదనలను...
కవిత తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలను వినిపించారు. నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసేులను పరిశీలించాలని కోరారు. మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారంటూ కపిల్ సిబాల్ వాదించారు. అయితే పీఎంఎల్‌ఏ యాక్ట్ కింద ఎవరినైనా కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలవచ్చని ఈడీ తరుపున న్యాయవాది అన్నారు. ఇరువరురి వాదనలు విన్న జస్టిస్ అజయ్ రసోగి, జస్టిస్ ద్వివేదిలతో కూడిన ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.