ఉచిత ప్రయాణం మొదలు.. వారి జీవితాల్లో చీకట్లు?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం అమలవుతూ

Update: 2023-12-09 12:15 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అనంతరం ఆర్టీసీ బస్సులో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ప్రయాణించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా మొదటి టిక్కెట్‌ను ప్రముఖ జర్నలిస్ట్ ఉమా సుధీర్‌కు అందించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం అమలవుతూ ఉండడంతో తమ బతుకుదెరువు పోతుందని ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలను నమ్ముకున్న తాము కుటుంబంతో సహా రోడ్డున పడతామని.. ఉచిత ప్రయాణంపై పున:పరిశీలన చేయాలని కోరుతున్నారు. దీనిపై చర్చించేందుకు ఆటోయూనియన్ నేతలు హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు. మహిళలు ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీంతో చాలా మంది మహిళలు బస్సులు ఎక్కడానికే మొగ్గు చూపుతున్నారు. ఆటోలు ఎక్కేవారు తక్కువ అయ్యారు. కర్ణాటకలో ఈ పథకం అమలు చేసిన సమయంలో కూడా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలో కూడా అదే జరుగుతోంది.


Tags:    

Similar News