Telangana Budget : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు;

Update: 2024-02-08 02:38 GMT
assembly sessions,  resume, today, telangana

telangana assembly today

  • whatsapp icon

నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. పదో తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.

ఆరు రోజుల పాటు...
అందుతున్న సమాచారం మేరకు సమావేశాలను ఆరు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుతో పాటు కులగణన బిల్లు, ఉద్యోగాల నియామకాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News