Revanth Reddy : వాటిపైన కూడా విచారణ చేస్తాం.. దోషులను వదలం
అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం, కొత్త సచివాలయ నిర్మాణంలో జరిగిన అవకతకవలపై విచారణకు ఆదేశిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం, కొత్త సచివాలయ నిర్మాణంలో జరిగిన అవకతకవలపై విచారణకు ఆదేశిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. వాటి నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చులపై విచారణ జరుపుతామని తెలిపారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు.
ఇసుక విధానంపై.....
ఇసుక విధానంపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉండేలా చూసేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనకు సంబంధించిన ప్రతి పనిపై విచారణ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దిగమింగిన ప్రతి పైసా రాబట్టేందుకే ఈ ప్రయత్నమని ఆయన చెప్పారు.