శశిథరూర్ కు దూరంగా టి. కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు;
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు. ఆయనను కలిసేందుకు ఇష్టపడటం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కలుద్దామని శశిథరూర్ కోరారు. అయితే తన సమీప బంధువు ఒకరు మరణించడంతో తాను కలవలేకపోతున్నానని శశిధరూర్ కు రేవంత్ రెడ్డి చెప్పారు.
ఎవరూ ఇష్టపడక....
ఈ విషయాన్ని శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయనను కలిసేందుకు ఎవరూ ఇష్పపడకపోవడంతో ఆయన మరోసారి కలుద్దామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే పోటీ చేశారు. ఆయనకు గాంధీ కుటుంబం అండదండలున్నాయి. అందుకే శశిథరూర్ ను కలిసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని తెలిసింది. నిన్న ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శశిథరూర్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆయన ఈరోజు తిరిగి వెళ్లనున్నారు. తాను నామినేషన్ ను ఉపసంహరించుకునేది లేదని, హైకమాండ్ కు చెప్పిన తర్వాతనే తాను నామినేషన్ వేశానని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.