Telangana Elections : ముగిసిన ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఐదు గంటలకు ఎన్నికల ప్రచారాన్ని నేతలు ముగించారు

Update: 2023-11-28 11:25 GMT

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఐదు గంటలకు ఎన్నికల ప్రచారాన్ని నేతలు ముగించారు. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిపోయింది. నేతలు ఇంటింటికి తిరిగి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు అన్ని పార్టీల అగ్రనేతలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమను ఎన్నుకుంటే ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరించారు. ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను కూడా ప్రజల ముందుంచారు.

ఇక ప్రజల చేతుల్లోనే...
ఇక ప్రజల చేతిలోనే అంతా పెట్టేశారు. గత నలభై రోజుల నుంచి నియోజకవర్గాల్లో పర్యటించిన నేతల గొంతులు బొంగురు బోయాయి. వేళా పాళా లేకుండా సభలకు హాజరు అవుతుండటంతో బీపీ, షుగర్ లాంటి వ్యాధులు కూడా కొందరు నేతలు తెచ్చుకున్నారు. ఇక సాయంత్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా 144వ సెక్షన్ ను విధించారు. ఇదుగురికి మించి ఎక్కడైనా గుంపు కూడితే చర్యలు తీసుకోనున్నారు. బార్లు, వైన్ షాపులు మూడు రోజులు మూత పడనున్నాయి. ఎన్నికలు ముగిసే వరకూ ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. ఇక పోలింగ్ కు అంతా సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News