నేటి నుంచి భట్టి విక్రమార్క కీలక సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో సమావేశం కానున్నారు;

Update: 2024-06-18 03:46 GMT
mallu bhatti vikramarka, deputy chief minister , good news, telangana
  • whatsapp icon

నేటి నుంచి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. బడ్జెట్ సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. శాఖల వారీగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు మల్లు భట్టి విక్రమార్క ముఖ్య శాఖల అధికారులతో సమావేశమై చర్చించననున్నారు.

ప్రతిపాదనలను...
వారి నుంచి ప్రతిపాదనలు తీసుకోనున్నారు. బడ్జెట్ సన్నాహక సమావేశాలలో మంత్రులు, కార్యదర్వులు, హెచ్‌డీవోలు కూడా పాల్గొనాలని ఆదేశాలు అందాయి. ఈరోజు మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖలకు చెందిన ప్రతిపాదనపై ఆ యా శాఖల మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు.


Tags:    

Similar News