తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 9,231 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది;
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురుకులాల్లో ఉన్న 9,231 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దీనికి వన్‌టైం రిజిస్ట్రేషన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అధికారులు వెల్లడించారు. మొత్తం తొమ్మిది నోటిఫికేషన్లను ప్రభుత్వం తాజాగా విడుదల చేయడం నిరుద్యోగులకు వరం లాంటిదేనని అంటున్నారు.
గురుకుల కళాశాలల్లో...
ఇందులో జూనియర్ కళాశాలల్లో 2,008 లెక్చరర్ పోస్టులతో పాటు, 868 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తారు. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో పోస్టుల కోసం నియామకపు నోటిఫికేషన్ విడుదల చేయడం ఇదే ప్రధమమని అంటున్నారు. పాఠశాలల్లో 1,276 పీజీటీ, 434 లైబ్రేరియన్ పోస్టులతో పాటు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.