ప్రభుత్వ సలహాదారుల తొలగింపు.. ఎంతమందినంటే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా

Update: 2023-12-09 10:54 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సోమేశ్ కుమార్, శోభ, జీఆర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఉన్నారు. వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు. ప్రభుత్వ సలహాదారులైన సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ, ఇరిగేషన్ అడ్వైజర్‌గా ఉన్న ఎస్కే జోషి, సాంస్కృతిక, దేవాదాయ సలహాదారుగా కేవీ రమణా చారి, అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారుగా శోభ, హోంశాఖ సలహాదారుగా అనురాగ్ శర్మ, ముస్లిం మైనారిటీ సంక్షేమ సలహాదారుగా ఏకే ఖాన్, ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లో స్పెషల్ ఆఫీసర్ హోదాలో జీఆర్ రెడ్డి, శివశంకర్, ఆర్ అండ్ బీ శాఖలో సుధాకర్ తేజ, అగ్రికల్చర్ ముఖ్య సలహాదారు చెన్నమనేని రమేష్, ఇంధన సెక్టార్‌లో రాజేంద్ర ప్రసాద్ సింగ్, ఉద్యాన శాఖలో శ్రీనివాస్ రావు ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నాయని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.


Tags:    

Similar News