న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో పిటీషన్
న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిింది;
న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా రాత్రి ఒంటి గంట వరకూ అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతిచ్చిందని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
అడ్డగోలు అనుమతలంటూ....
హైకోర్టు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతిచ్చింది. వైన్స్ షాపులకు రాత్రి 12 గంటల వరకూ, పబ్ లు, బార్లకు రాత్రి ఒంటి గంట వరకూ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 62 ఒమిక్రాన్ కేసులు నమోదయిన సంగతి కూడా పిటీషనర్ గుర్తు చేశారు. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.