నేడు హైకోర్టులో కరోనా పై విచారణ
తెలంగాణ హైకోర్టులో నేడు కరోనా పరిస్థితులపై విచారణ జరగనుంది. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గలేదు;
తెలంగాణ హైకోర్టులో నేడు కరోనా పరిస్థితులపై విచారణ జరగనుంది. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గలేదు. గతంలో రోజుకు లక్ష వరకూ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. విద్యాసంస్థలను ఎప్పుడు తెరుస్తారని కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా మేడారం జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు కాబట్టి కోవిడ్ జాగ్రత్తలు ఏ మేరకు తీసుకుంటారని కూడా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మేడారం జాతర....
తెలంగాణలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నందున నైైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం విద్యాసంస్థలు కూడా ప్రారంభమయ్యాయి. కోవిడ్ పరీక్షలు రోజుకు లక్ష చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. కరోనా కేసులు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో హైకోర్టు నేడు కరోనా పరిస్థితులపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.