Telangana : గ్రూప్ 2 అభ్యర్థులకు తాజా అప్ డేట్
గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి తాజా అప్ డేట్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది
గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి తాజా అప్ డేట్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు జరుగుతాయి. అయితే ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ఈ నెల 9 నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఆరోజు నుంచే వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
రెండు విడతలుగా...
ప్రతి రోజూ ఉదయం రెండు విడతలుగా పరీక్షలను నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపిది. ఉదయం 8.30 గంటల నుంచి .30 గంటల వరకూ, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకూ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రానికి ముందు వచ్చిన వారినిమాత్రమే అనుమతిస్తారు. ఆలస్యంగా వస్తే అనుమతించరని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.