ఎంపీ కేశవరావుకు కరోనా
తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది;
తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసొలేషన్ లో ఉన్నారు. కే. కేశవరావు తనకు కొంత అనారోగ్యంతో ఉండటంతో నిమ్స్ కు వెళ్లి వైద్యులను సంప్రదించారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీలో పర్యటించిన....
ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు కేశవరావు ఢిల్లీ వెళ్లారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ బృందంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా సోకింది. ఆయనతో పాటు కేశవరావుకు కూడా కరోనా సోకడంతో మిగిలిన మంత్రులు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు.