నేడు తెలంగాణలో ఆరోరోజుకు ప్రజాపాలన విజయోత్సవాలు

తెలంగాణలో ఆరో రోజు ప్రజా పాలన విజయోత్సవాలు నేడు జరుగుతున్నాయి. నేడు హోంశాఖలో విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Update: 2024-12-06 03:27 GMT

తెలంగాణలో ఆరో రోజు ప్రజా పాలన విజయోత్సవాలు నేడు జరుగుతున్నాయి. నేడు హోంశాఖలో విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండటంతో గత ఆరు రోజుల నుంచి ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఏడాది కావడంతో...
ప్రతి రోజూ ఒక్కొక్క విభాగానికి సంబంధించిన విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తాము ఏడాది కాలంలో చేపట్టిన పనులు, రానున్న కాలంలో భవిష్యత్ ప్రణాళికలను ఈ ప్రజాపాలన విజయోత్సవాల వేదికల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News