Kishan Reddy : మోదీ మళ్లీ వస్తేనే ప్రగతి

కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఫాం హౌస్‌లున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

Update: 2024-04-13 08:02 GMT

కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఫాం హౌస్‌లున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన తప్పులే ఆయనను అధికారం నుంచి దించివేశాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలో డబుల్ డిజిట్ లో పార్లమెంటు స్థానాలను బీజేపీ సాధించాలన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి మోదీ ప్రభుత్వం 400 స్థానాలకు పైగానే సాధించి మూడోసారి ఏర్పడుతుందన్నారు.

మూడోసారి...
బీఆర్ఎస్ పని తెలంగాణలో అయిపోయినట్లేనని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆపార్టీని ఎవరూ నమ్మడం లేదన్నారు.దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే బీజేపీకే ఓటు వేయాలని కోరారు. కరనా సమయంలో మోదీ వ్యవహరించిన తీరు అందరికీ తెలుసునన్న కిషన్ రెడ్డి దేశంలో పేదలను ఆదుకునే ప్రభుత్వం మోదీ సర్కార్ మాత్రమేనని అన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత తీసుకు వచ్చిన సంస్కరణలతో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. మిగిలిన దేశాలు సయితం బారత్ వైపు చూస్తున్నాయంటే అది మోదీ వల్లనేనని అన్నారు.


Tags:    

Similar News