కొండెక్కిన కూరగాయ ధరలు.. కొనేదెలా?
మార్కెట్ లో కూరగాయ ధరలను చూస్తే కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఆకు కూరల నుంచి గడ్డ కూరల వరకూ ఒకే సారి రేట్లు పెంచేశారు
భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా కురుస్తున్నాయి. తెలంగాణలో చిరు జల్లులయినా ఏపీ లో మాత్రం వానలు దంచికొట్టాయి. ఈ దెబ్బకు కూరగాయల ధరలు కూడా కొండెక్కాయి. మార్కెట్ లో కూరగాయ ధరలను చూస్తే కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఆకు కూరల నుంచి గడ్డ కూరల వరకూ ఒకే సారి రేట్లు పెంచేశారు. ఏ కూరగాయ కిలో అరవై రూపాయలకు దిగువన లేదు.
టమోటా ధర పైపైకి....
ఇక టమోటా హైదరాబాద్ మార్కెట్ ధరలో కిలో టమాల అరవై రూపాయలు పలికింది. కిలో టమాటా మదన పల్లి మార్కెట్ లో 104 ధర పలకడం రికార్డుగా చెబుతున్నారు. టామాటా ధరలు కొండెక్కి కూర్చోవడంతో వినియోగదారులు అల్లాడి పోతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమోటా పంట దెబ్బతినడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.